భక్తిపారవశ్యంతో పులకించిన డామినేడు విజయ గణపతి ఆలయం

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి రూరల్

తిరుపతి రూరల్ మండల పరిధిలోని డామినేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ గణపతి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త చిన్నీ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్ రాయల్ నాయకత్వంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి స్వామివారి ఆశీస్సులు పొందారు.