ప్రభుత్వమే కబ్జాకోరుగా మారింది: మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Telangana
సింగరేణిలో వేలాది ఇళ్లను 22A జాబితాలో చేర్చి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సొంత ఇళ్ల కోసం పోరాడుతున్న బాధితులను కబ్జాదారులుగా ముద్ర వేయడం దారుణమని ఆయన విమర్శించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే నేడు కబ్జాకోరుగా మారిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.