ఇంగ్లండ్‌లో విజయ్, అజిత్ అరుదైన కలయిక, వైరల్ అవుతున్న ఫోటోలు
రిపోర్టర్: సురేష్
స్థలం: World
ఇంగ్లండ్‌లోని సిల్వర్‌స్టోన్ వేదికగా జరిగిన లే మాన్స్ రేస్‌లో కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కుమార్ కలుసుకున్నారు. దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య ఉన్న ఫ్యాన్ వార్‌కు చెక్ పెడుతూ ఇద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ అజిత్‌కు చిన్న కార్ల మోడల్‌ను బహుమతిగా ఇవ్వగా, అజిత్ తన సంతకంతో కూడిన హెల్మెట్‌ను విజయ్‌కు అందజేశారు. ఈ అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.