తాళం వేసిన ఆయుర్వేదిక్ విభాగం: జన్నారంలో తీవ్ర ఇబ్బందుల్లో రోగులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయుర్వేదిక్ విభాగం తెరుచుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం పలు గ్రామాల నుంచి వైద్య చికిత్స కోసం వచ్చిన బాధితులు, దవాఖానాకు తాళాలు వేసి ఉండటాన్ని చూసి తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. రెగ్యులర్ డాక్టర్, సహాయక సిబ్బంది లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి వైద్య సేవలు తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.