అర్నబ్ తుపాను బీభత్సం: విశాఖ తీరంలో భారీగా ఆస్తినష్టం
రిపోర్టర్: మహేష్
స్థలం: విశాఖపట్నం
అర్నబ్ తుపాను ప్రభావంతో విశాఖ మహానగరం అతలాకుతలం కాగా భారీగా ఆస్తినష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. ఫిషింగ్ హార్బర్లో పలు పడవలు మునిగిపోవడంతో పాటు తీర ప్రాంతంలో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన అలంకరణలు ధ్వంసమయ్యాయని, తీర ప్రాంతం కోతకు గురైందని వెల్లడించారు. సముద్ర ఒడ్డున తెల్లని ఇసుక నల్లగా మారడంతో పాటు పాదచారుల రహదారిపై అక్కడక్కడా పెద్ద గుంతలు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు.