తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం
రిపోర్టర్: రమేష్
స్థలం: తిరుపతి
తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. 7వ మైలు ప్రాంతంలో చిరుతను చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న తితిదే విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమై భక్తులను గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తుల భద్రత కోసం అధికారులు నిఘా పెంచి, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.