ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు: బాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. తొలిరోజు అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవి రూపంలో భక్తులకు దివ్యదర్శనం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ముందుగా పోలీసులు అమ్మవారికి ఆచారబద్ధంగా తొలి సారె సమర్పించారన్నారు. ఈ పది రోజుల వేడుకలకు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.