దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు: ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు, కేరళ, సిక్కిం రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. సంబంధిత గవర్నర్లు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.