తాళం వేసిన ఇళ్ల భద్రత కోసం ప్రత్యేక ఎల్హెచ్ఎంఎస్: ప్రజల నుంచి స్పందన కరువు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నెల్లూరు

దసరా సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే గృహస్థులు తాళం వేసిన ఇళ్ల భద్రత కోసం పోలీసులు అందిస్తున్న ఎల్హెచ్ఎంఎస్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. నెల్లూరు నగరంలో దాదాపు పది లక్షల జనాభా ఉన్నప్పటికీ, ఉచితంగా రూ.20 వేల విలువైన కెమెరాలు అమరుస్తున్నా కేవలం పదుల సంఖ్యలోనే ప్రజలు ముందుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన అవగాహన లేకపోవడం వల్లే నగరీయులు ఈ ఉచిత సేవను ఉపయోగించుకోలేకపోతున్నారని పోలీసులు స్పష్టం చేశారు.