భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర బీభత్సం సృష్టించిన ఈదురుగాలుల వాన
రిపోర్టర్: అశోక్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాలని, పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.