ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన నిర్మాణ పనులను తనిఖీ చేసిన మంత్రి పొంగులేటి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద తరుణీ హట్ ప్రాంగణంలో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన నిర్మాణ పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భవన సముదాయం అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు.