పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్ర తనకు రావాల్సిందని శివాజీ వెల్లడి

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

టాలీవుడ్ నటుడు శివాజీ తాజాగా పుష్ప చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్ర మొదట తనకు రావాల్సిందని, కానీ అది సునీల్‌కు దక్కిందని ఆయన తెలిపారు. తెల్ల కాగితం సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ ఈ విషయాలను పంచుకుంటూ, ఒక పాత్ర ఎవరికి రాసి ఉంటే చివరికి వారికే వెళ్తుందని, సునీల్ ఆ పాత్రలో అద్భుతంగా నటించారని ప్రశంసించారు.