హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించనున్న ఎన్‌హెచ్‌ఏఐ

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం మధ్య కీలకమైన ఎన్‌హెచ్‌-65ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. మల్కాపూర్‌ నుంచి నందిగామ వరకు సుమారు 181.300 కిలోమీటర్ల మేర హైవేను సుమారు రూ.6,792.52 కోట్ల అంచనా వ్యయంతో బిల్డ్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ విధానంలో చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం తగ్గించేందుకు 60 వెహిక్యులర్ అండర్‌పాస్‌లు, జంతువుల భద్రత కోసం 10 ప్రత్యేక అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.