ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌తో ఆర్థికంగా నష్టపోతున్న యువత
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ఆశ్రయించి యువత తీవ్రంగా మోసపోతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మోసపూరితమైనవని, ప్రారంభంలో గెలుపును చూపించి ఆ తర్వాత నిండా ముంచుతాయని సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈజీ మనీ ట్రాప్‌లో పడి విలువైన జీవితాలను, కష్టపడి సంపాద డబ్బును కోల్పోవద్దని ప్రజలకు, ముఖ్యంగా యువతకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.