బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై అమితాబ్ ఆవేదన

రిపోర్టర్: శివ స్థలం: ముంబై

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా అకస్మాత్తుగా మృతి చెందడంపై దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలోని తన నివాసంలో బాత్రూమ్ లో జారిపడి మృతి చెందిన సంజయ్ గుప్తా ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు. ఒక స్నేహితుడు, తోటి కళాకారుడు ఇంత చిన్న వయసులోనే మమ్మల్ని విడిచి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అమితాబ్ తన బ్లాగ్ వేదికగా భావోద్వేగంతో పేర్కొన్నారు.