సర్ ప్రక్రియ ముగిసేవరకు స్థానిక ఎన్నికలు ఆపలేమని స్పష్టం చేసిన ప్రభుత్వం

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ ముగిసేవరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేసే అవకాశం లేదని ప్రభుత్వం, ఎస్ఈసీ హైకోర్టుకు స్పష్టం చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన బెంచ్ వాదనలను పూర్తి చేసి తీర్పును రిజర్వు చేసింది. బీసీ జనగణన, ఉపవర్గీకరణ అంశాలపై కూడా కోర్టులో కీలక చర్చ జరిగింది.