ఖమ్మంలో ఘనంగా మహిళా సమాఖ్య సన్నాహక సమావేశం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం వాసిరెడ్డి కళ్యాణమండపంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య మూడవ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ భాష తదితరులు పాల్గొన్నారు. మహాసభలను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల సాధనకు మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.