ఆయుష్మాన్ భారత్ పథకానికి విజయవంతంగా ఎనిమిదేళ్లు పూర్తి
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
దేశంలో పేదలందరికీ నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం విజయవంతంగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణలో ఈ పథకం ద్వారా ఆరోగ్య సేవలు మరింత బలోపేతమయ్యాయని, కోట్లాది మంది పేదలకు మెరుగైన వైద్యం అందుతోందని స్పష్టమైంది.