వైసీపీకి షాక్ ఇస్తూ జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు
రిపోర్టర్: రాజేష్
స్థలం: కాకినాడ
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీకి రాజీనామా చేసి, కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో సీనియారిటీకి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే తాను వైకాపాను వీడినట్లు ఆయన స్పష్టం చేశారు.