ముంబైలో నేరస్థులపై సర్కార్ కొరడా: పదమూడు మంది రౌడీషీటర్లు బహిష్కరణ

రిపోర్టర్: సతీష్ స్థలం: Mumbai

ముంబై నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నట్లు నగర పోలీసు అధికారులు వెల్లడించారు. దహిసర్ నుంచి గోరెగావ్ ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న పదమూడు మంది నేరస్థులను నగర సరిహద్దుల నుంచి రెండు సంవత్సరాల పాటు బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లపై తగిన ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత తొలగిపోయి ఊరట లభించింది.