నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఏపీలో సివిల్స్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు నగదు ప్రోత్సాహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ లో సివిల్స్ సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్‌తో పాటు మెయిన్స్ అర్హత సాధిస్తే రెండు లక్షల రూపాయల నగదు బహుమతి అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించినట్లు మంత్రి సవిత తెలిపారు. పీ4 మోడల్ ద్వారా ఎంపికైన వంద మందికి ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు నిపుణుల ద్వారా నాణ్యమైన డిజిటల్ క్లాసులు అందిస్తామని పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు స్పష్టం చేశారు.