టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన వెటరన్ ఇమ్రాన్ తాహిర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా వారియర్స్ తరఫున ఆడుతున్న 47 ఏళ్ల సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అద్భుతం సృష్టించాడు. సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీ20 చరిత్రలో ఐదు వికెట్లు తీసిన అత్యంత పెద్ద వయస్కుడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగరాశాడు.