ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం, 2029లోగా మరో మూడు నోటిఫికేషన్లు: లోకేశ్
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఏటా డీఎస్సీ నిర్వహిస్తుందని, 2029లోగా మరో మూడు నోటిఫికేషన్లు వస్తాయని స్పష్టం చేశారు. కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయని విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం తెచ్చిన 117 జీవోతో విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారని, తమ హయాంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తామని ఆయన ఉద్ఘాటించారు.