గుంతకల్లులో భారీ దోపిడీ నలభై తులాల బంగారం అపహరణ
రిపోర్టర్: మహేష్
స్థలం: గుంతకల్లు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏబీ ఫంక్షన్ హాలు ఏరియాలో ఇంట్లో ఉన్న వివాహిత నివేదితపై కారం చల్లి, కత్తులతో బెదిరించి నలభై తులాల బంగారు ఆభరణాలు మరియు రెండు లక్షల రూపాయల నగదును దుండగులు అపహరించుకెళ్లారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.