విజయవాడలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అరెస్ట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Vijayawada

విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ నియామకాల అక్రమాలను నిరసిస్తూ వైయస్‌ఆర్సీపీ తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాప్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తున్న నాయకులను ముందస్తుగా అడ్డుకోవడంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.