గిరిజన ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు విస్తరించాలంటూ నివేదిక వెల్లడి

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం వర్షపాతంపై ఆధారపడి ఉందని, సాగు విస్తీర్ణం పెంచడానికి నీటిపారుదల సౌకర్యాలు విస్తరించాలని ఇండిజినస్ అగ్రికల్చర్, లైవ్లీహుడ్స్, అండ్ సస్టైనబిలిటీ ఇన్ ట్రైబల్ ఆంధ్రప్రదేశ్ నివేదిక స్పష్టం చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలపై చెక్డ్యామ్లు నిర్మించాలని, పశువుల కొనుగోలుకు ఆర్థిక చేయూత అందించాలని సూచించింది. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ మద్దతు కల్పించాలని, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లో అధ్యయనం చేసినట్లు సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ పరిశోధకులు తెలిపారు.