డాన్స్ జోడి డాన్స్ విజేతలుగా గోమతి మరియు కెన్ని నిలిచారు

రిపోర్టర్: రమేష్ స్థలం: తమిళనాడు

ప్రముఖ రియాలిటీ షో డాన్స్ జోడి డాన్స్ గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ 20న వైభవంగా ముగిసింది. అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్న గోమతి మరియు కెన్ని జోడి ఈ సీజన్ విజేతలుగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. నికిత మరియు నవీన్ ప్రథమ రన్నరప్‌గా, అరునిమ మరియు అభిషేక్ ద్వితీయ రన్నరప్‌గా నిలిచారు. ప్రశాంత్, సిమ్రాన్, స్నేహ ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా మణిమేఘల మరియు అజార్ హోస్ట్‌లుగా అలరించారు.