రైల్వే కోడూరులో వైభవంగా సాగిన వాసవి అమ్మవారి అగ్నిగుండం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వే కోడూరు

రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి అగ్నిగుండం కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో విశేష పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెండ్యాల విజయకుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.