కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలపై బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
ఓటర్ల నమోదు ఫామ్-6 మార్పులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను దిగజార్చేలా రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన అధికారిక సమాచారంతో కాంగ్రెస్ కుట్రలు పూర్తిగా బట్టబయలయ్యాయని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రజాదరణను తగ్గించేందుకే విపక్షాలు నిరంతరం తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని తెలిపారు.