జూరాల వెళ్తుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్

రిపోర్టర్: విజయ్ స్థలం: Telangana

జూరాల ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్ట్ పట్ల బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఆందోళనకు దిగాయి. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణచివేయాలని చూస్తున్నారంటూ పోలీసుల చర్యలపై మండిపడ్డారు.