రైలు ఆలస్యంపై ప్రయాణికుడికి నష్టపరిహారం చెల్లించాలని కన్స్యూమర్ కమిషన్ ఆదేశం

రిపోర్టర్: సతీష్ స్థలం: జార్ఖండ్

జార్ఖండ్‌లోని టాటానగర్ నుండి సంబల్‌పూర్‌కు ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సంజయ్ కుమార్ అనే ప్రయాణికుడు రైలు ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై జిల్లా కన్స్యూమర్ కమీషన్‌ను ఆశ్రయించగా, రైల్వే శాఖ సేవల వైఫల్యాన్ని తప్పుపట్టింది. ప్రయాణికుడికి ముప్పై వేల రూపాయల నష్టపరిహారంతో పాటు ఐదు వేల రూపాయల కోర్టు ఖర్చులను చెల్లించాలని తీర్పు వెలువరించింది.