ఎల్ నినో పేరుతో రైతులకు నీళ్లివ్వట్లేదంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

ఎల్ నినో పేరు చెప్పి రాష్ట్రంలో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువు అని ఆయన మండిపడ్డారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. నీటి కొరత వల్ల కాక ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.