గిరిజన సంక్షేమ హాస్టళ్ల డైట్ ఛార్జీలు పెంచాలని చంద్రబాబుకు సంధ్య రాణి విజ్ఞప్తి

రిపోర్టర్: గోపి స్థలం: పార్వతీపురం మన్యం

రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక, వెనుకబడిన మరియు మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీలను పెంచి విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంధ్య రాణి పార్వతీపురం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంక్షేమ హాస్టళ్లు మరియు గురుకుల పాఠశాలల్లో డైట్ ఛార్జీల పెంపు అంశంపై ప్రత్యేకంగా చర్చించి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.