ఆరోగ్య చిట్కాలు: డైట్ మానేశాక తిరిగి బరువు ఎందుకు పెరుగుతారో తెలిపిన డాక్టర్
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
డైట్ ముగిసిన తర్వాత కొందరు మళ్లీ బరువు పెరగడానికి జీవ సంబంధమైన సమస్యలు, హార్మోన్ల మార్పులే ప్రధాన కారణమని గ్లెనీగల్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హిరాన్ ఎస్ రెడ్డి వెల్లడించారు. అడాప్టివ్ థర్మోజెనిసిస్ కారణంగా బాడీ తక్కువ కేలరీలను ఖర్చు చేస్తుందని, ఆకలి హార్మోన్లు పెరగడం వల్ల ఎక్కువగా తింటారని ఆయన తెలిపారు. సరైన ప్రణాళికతో బరువును అదుపులో ఉంచుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.