రోజుకు ఒక్క సిగరెట్ కాలుస్తున్నా గుండెకు తీవ్ర ముప్పేనని హెచ్చరిక
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
రోజుకు కేవలం ఒక్క సిగరెట్ కాలుస్తే ఎలాంటి ప్రమాదం ఉండదనే అపోహ పూర్తిగా తప్పని ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సమీర్ గుప్తా స్పష్టం చేశారు. తక్కువగా ధూమపానం చేసినప్పటికీ గుండె జబ్బుల ముప్పు తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. సిగరెట్ పొగలోని హానికారక పదార్థాలు రక్తనాళాలను దెబ్బతీసి ప్రాణాంతక గుండెపోటులకు దారితీస్తాయని వైద్యులు వెల్లడించారు. ధూమపానానికి ఎలాంటి సురక్షిత పరిమితి లేదని, ఒక్క సిగరెట్ కూడా హానికరమేనని తాజా అధ్యయనాలు తేల్చిచెప్పాయి.