రుస్తుం మైన్ అక్రమ మైనింగ్ కేసు: వాకాటి శ్రీనివాసులు రెడ్డికి పోలీసుల నోటీసులు
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేశారు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో మొత్తం పదకొండు మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.