బీహార్‌లో విద్య, విద్యుత్ రంగాలు అభివృద్ధి చెందాయన్న ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి

రిపోర్టర్: కిరణ్ స్థలం: Bihar

బీహార్‌లో విద్య, విద్యుత్ రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి స్పష్టం చేశారు. పట్నాలో జరిగిన బీహార్ కే సచ్చే నాయక్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కోటి 70 లక్షల కుటుంబాలకు ఏడాది పాటు కరెంట్ బిల్లు రాలేదని, కేవలం 22 లక్షల కుటుంబాలు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నాయని వెల్లడించారు. అలాగే విద్యార్థుల కోసం 700 మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేసి కోటా తరహాలో జేఈఈ, నీట్ ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.