అట్టహాసంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: గుంటూరు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాల్లోకి అడుగుపెట్టింది. అమరావతిలో జరిగే ఈ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 1976లో ఆవిర్భవించిన ఈ వర్సిటీ ఇప్పటివరకు 8.40 లక్షల మందికి డిగ్రీలు ప్రదానం చేసింది. వివిధ దేశాల నుంచి 1,146 మంది విదేశీ విద్యార్థులు విద్యనభ్యసించారు. ఎందరో ప్రముఖులను తీర్చిదిద్దిన ఈ విద్యాసంస్థ స్వర్ణోత్సవ వేళ నూతనోత్సాహంతో ముందుకువెళ్తోంది.