విజయవాడలో వైభవంగా 72 అడుగుల పంచముఖ మహా గణపతి ఉత్సవాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: NTR
విజయవాడ విద్యాధరపురంలో ఖైరతాబాద్ గణపతి తరహాలో ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ పంచముఖ వరసిద్ధి మహా గణపతి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 14 నుంచి 24 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా మట్టి, కొబ్బరిపీచుతో రూపుదిద్దుకున్న ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిమజ్జనం తర్వాత మట్టిని కుండీల్లో సేకరించి మొక్కలు పంపిణీ చేయనున్నారు.