గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసు నిందితుల అరెస్ట్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రామగుండం

గోదావరిఖనిలో యువతి అనుమానాస్పద మృతి కేసును వన్టౌన్ పోలీసులు ఛేదించారు. ప్రేమ, ఈర్ష్య కారణంగా ప్రధాన నిందితుడు జెట్టి నవీన్కుమార్, మరో నిందితుడు బొమ్మకంటి రవికుమార్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి పురుగుల మందు బలవంతంగా తాగించి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, కాల్డేటా ఆధారంగా నిందితులను పట్టుకుని కారు, రెండు ఫోన్లు, ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు.