భారత స్టాక్ మార్కెట్‌లో వచ్చే వారం భారీ ఐపీఓల సందడి
రిపోర్టర్: శివ
స్థలం: India
భారత ప్రైమరీ మార్కెట్‌లో వచ్చే వారం ఏకంగా 11 కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ.24,574 కోట్లు సమీకరించనున్నాయి. ఇందులో ఎన్‌ఎస్‌ఈ మరియు హీరో మోటార్స్ ఐపీఓలు ప్రధానంగా ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ ఇష్యూ పరిమాణం రూ.22,562 కోట్లు కాగా, సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు అందుబాటులో ఉంటుంది. భారీగా వస్తున్న ఈ ఐపీఓలతో ఇన్వెస్టర్ల మధ్య నిధుల కోసం గట్టి పోటీ నెలకొంది.