గ్రామీణ మహిళ అద్భుత ప్రస్థానం: ఐదు కోళ్లతో మొదలై నేడు రూ.లాయ్ ఆదాయం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: South Andaman

దక్షిణ అండమాన్ లోని వాండూర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి కేవలం ఐదు స్వదేశీ కోళ్లతో ఇంటి వద్దే పెంపకం ప్రారంభించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలోని సీఐఏఆర్ఐ అందించిన శాస్త్రీయ శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వంతో ఆమె నేడు నెలకు సుమారు రెండు వేల కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. దీని ద్వారా ఆమెకు ప్రతినెల సుమారు ఒక లక్షా తొంబై ఒక్క వేల రూపాయల నికర లాభం వస్తుందని ఐసీఏఆర్ అధికారులు తెలిపారు.