రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 10న 'సంజీవని' వైద్య కార్యక్రమం ప్రారంభం

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ప్రతిష్ఠాత్మక సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 10న ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ వెల్లడించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు దీనిపై పురోగతిని వివరించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.