పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన చిత్తూరు సిబ్బంది.. 30 పతకాలు!

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిత్తూరు

రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహించిన క్రీడల్లో చిత్తూరు జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అనంతపురం రేంజ్ తరఫున పాల్గొన్న 17 మంది అధికారులు, సిబ్బంది మొత్తం 30 పతకాలు సాధించి జిల్లా కీర్తిని పెంచారు.

ఈ విజేతలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించి సత్కరించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు.