'ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్': షాజాద్ భట్టి నెట్‌వర్క్ నిషేధం

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షాజాద్ భట్టి నెట్‌వర్క్ (ఎస్‌బీఎన్)ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ఈ సిండికేట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని జీరో టోలరెన్స్ విధానంలో భాగంగా ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది.