పార్టీనే సుప్రీం, మంత్రులైనా ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందే: నారా లోకేశ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
పార్టీ పదవుల్లో ఉన్నవారిని మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందేనని, పార్టీనే సుప్రీం అని తెదేపా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు బీఫారం ఇవ్వకపోతే ఇక్కడున్నవారెవరూ ప్రజాప్రతినిధులు కాలేరని గుర్తుచేశారు. పార్టీని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని, పార్టీ అప్పగించిన పనులకే తొలి ప్రాధాన్యమివ్వాలని తేల్చిచెప్పారు.