నివీ డెవలపర్స్‌ అధినేత రాంరెడ్డి ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: రంగారెడ్డి

నివీ డెవలపర్స్‌ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు తీవ్రతరం చేశారు. భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు, హెచ్‌ఎండీఏ అనుమతులు, ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల భారంతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రాంరెడ్డి భార్య మాధవిని విచారించిన పోలీసులు, ఆయన చివరి కాల్స్ మరియు వాయిస్ చాటింగ్ ఆధారంగా ఎవరైనా ఒత్తిడికి గురిచేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.