ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. తెలంగాణ స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.