హస్తినాపురంలో యువకుడి హత్య కేసు నిందితుల ఇళ్ల కూల్చివేత

రిపోర్టర్: విజయ్ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హస్తినాపురంలో 24 ఏళ్ల యువకుడు నితిన్ హత్య కేసులో ముగ్గురు నిందితుల అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్‌తో కూల్చివేశారు. నితిన్ హత్యను నిరసిస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.