కేజీబీవీల్లో ఇష్టారాజ్యంగా గుడ్ల సరఫరాపై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: విజయ్ స్థలం: Sri Potti Sriramulu Nellore

కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కోడిగుడ్ల సరఫరా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. వారానికి ఒకసారి ఇవ్వాల్సి ఉండగా, గుత్తేదారు రవాణా ఛార్జీలు తగ్గించుకునేందుకు పదిహేను, ఇరవై రోజులకు ఒకసారే సరఫరా చేస్తున్నారు. ఒకేసారి ఇస్తుండటంతో గుడ్లు నిల్వ చేయడం కష్టంగా మారి పాడవుతున్నాయి. తక్కువ బరువున్న గుడ్లను ఇస్తూ విద్యార్థినిల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తున్నారు.